బీజేపీలోకి వైసీపీ ఎంపీలు: ఆదినారాయణ రెడ్డి

65చూసినవారు
బీజేపీలోకి వైసీపీ ఎంపీలు: ఆదినారాయణ రెడ్డి
వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ పార్టీ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి మినహా మిగిలిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా బీజేపీలో చేరాలనుకుంటున్నారని, ఇందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభించామని చెప్పారు. త్వరలో వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్