AP: వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నేడు పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల గొంతుకగా ప్రభుత్వాన్ని నిలదీయాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దిగి వచ్చే వరకూ వారికి అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బరితెగించి వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వంపై కలిసికట్టుగా పోరాడుదామని పార్టీ నేతలతో ఆయన అన్నారు.