తెలంగాణ తల్లిని కాంగ్రెస్ పార్టీ అగౌరపరిచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహించారు. కవులు, కళాకారులు, ఉద్యమకారుల ప్రతీకే తెలంగాణ తల్లి ఉండగా కాంగ్రెస్ తల్లిని తెచ్చి సెక్రటేరియట్‌లో ప్రతిష్టించి తెలంగాణ తల్లిని అగౌరపరచారని చెప్పారు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి కాలక్షేపం కోసం మాత్రమే ఈ నాటకం ఆడుతున్నారని పేర్కొన్నారు.