జమ్మూ కశ్మీర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం హంజీవర ప్రాంతంలోని బారాముల్లాలో ఉన్న పట్టాన్‌లో సుహైబ్ అనే 20 ఏళ్ల యువకుడు
క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురయ్యాడు. ఈ మేరకు బంతి విసురుతుండగా ఛాతీలో నొప్పి వచ్చి మైదానంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే తోటి ఆటగాళ్లు యాసిన్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. దీంతో పట్టాన్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.