AP: ఒకప్పటి మిత్రులు ఇప్పుడు శత్రువులయ్యారు. వైసీపీ అధినేత జగన్ టార్గెట్‌గానే విమర్శల దాడి చేస్తున్నారు. వైసీపీలో నం.2గా చెప్పుకోబడిన విజయసాయిరెడ్డి జగన్‌కు కంట్లో నలుసుగా తయారయ్యారు. కాకినాడ సీపోర్టు వాటా వ్యవహారంపై పూర్తి వివరాలు చెప్తానంటున్నారు. విజయసాయిరెడ్డి రచ్చ చల్లారకముందే బాలినేని శ్రీనివాస్ ఎంటరయ్యారు. జగన్ తన ఆస్తులు, తన వియ్యంకుడి ఆస్తులు కాజేశారని ఆరోపించారు. దాంతో ఒకప్పటి ఆప్తులే జగన్‌ను టార్గెట్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి.