తెలుగు రాష్ట్రాల్లో మామిడి పంటను సాగు చేసే రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. వేసవిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే ఈ ఫలానికి మార్కెట్‌లో డిమాండ్ కూడా ఎక్కువే. అయితే, ప్రస్తుతం మామిడి తోటలు పిందె, కాయ దశలో ఉన్నాయి. ఈ సమయంలో అనేక తెగుళ్లు ఆశించి పంటకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా బూడిద తెగులు, మసి తెగులులో మామిడి పంటను ఆశించే లక్షణాలు ఉన్నాయి.