ఈ తెగులు సోకినప్పుడు పైరెమ్మలు, పూత, పిందెల మీద బూడిద లాంటి తెల్లటి పదార్థం ఏర్పడుతుంది. ఈ శీలింద్రం పూత, పిందె నుంచి పోషకాలను పీల్చుకోవడం వల్ల అవి రాలిపోతాయి. రాత్రి చలి ఎక్కువగా ఉండి.. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రా. (లేదా) డినోకాప్ 1 మిల్లీ లీటరు (లేదా) హెక్సాకోనజోల్ 2 మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.