తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్‌లో పొట్టిశ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు పేరును మార్చడాన్ని ఖండిస్తూ.. ఆయన ఓ దేశభక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడని గుర్తుచేశారు. ఆంధ్రా మూలాలుంటే పేర్లు మార్చేస్తారా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి వంటి పేర్లను మార్చే ధైర్యం ఉందా? అని నిలదీశారు.