పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మరో ఉగ్రదాడి సంభవించింది. నుష్కి-దల్బందీ నేషనల్ హైవేపై మిలిటరీ కాన్వాయ్‌పై తీవ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ పేలుడులో కనీసం 12 మంది పాకిస్థాన్ సైనికులు మరణించగా 10 మంది పౌరులు గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను నుష్కి ఆస్పత్రికి తరించగా చికిత్స అందిస్తున్నారు. భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి దర్యాప్తు చేస్తున్నాయి.