ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్సీ

81చూసినవారు
ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్సీ
AP: పులివెందుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో మాజీ సీఎం జగన్ విఫలమయ్యారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అన్నారు. అసెంబ్లీకి వెళ్లని జగన్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేంపల్లిలో తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల పరిస్థితిని అసెంబ్లీలో జగన్ ప్రస్తావించాలని తెలిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్