హూతీలపై అమెరికా దాడి.. 31 మంది మృతి

72చూసినవారు
హూతీలపై అమెరికా దాడి.. 31 మంది మృతి
యెమెన్‌లోని హూతీలపై ట్రంప్ సర్కార్ సైనిక చర్యను ప్రారంభించింది. తాజాగా యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడాలే లక్ష్యంగా దాడులు జరిపారు. అయితే ఇప్పటికే ఈ దాడుల్లో 31 మంది మృతి చెందగా. వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు హూతీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక 101 మంది తీవ్రంగా గాయపడ్డారు. అమెరికా దాడులను హూతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా అభివర్ణించింది.

సంబంధిత పోస్ట్