వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓటమి తర్వాత ఏపీకి చుట్టపు చూపగానే వచ్చి పోతున్నారు. ఎక్కువ సమయం బెంగళూరులోనే గడుపుతున్నారు. అయితే ఈసారి జగన్ దీర్ఘకాలం పాటు విదేశీ యాత్రకు ప్లాన్ చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. తాజా పరిస్థితుల దృష్ట్యా ఆయన లండన్ వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమచారం. అందుకే జగన్ దంపతులు తమ పాస్‌పోర్టులను రెన్యూవల్ చేయించుకున్నారని అంటున్నారు.