AP: బడ్జెట్ పై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్ అంకెలు ఘనం, కేటాయింపులు శూన్యం అన్నట్లు ఉందని అన్నారు. దశ దిశ లేని.. పస లేని బడ్జెట్ ఇదని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాలకు, ఇతర హామీలకు ఎగనామం పెట్టారని అన్నారు. అన్నదాత సుఖీభవ పథకానికి కేవలం రూ.6,300 కోట్లు కేటాయించడం సరికాదన్నారు.