AP: YCP మాజీ MP గోరంట్ల మాధవ్‌కు ఉచ్చు బిగిస్తోంది. అత్యాచారం, హత్యకు గురైన బాధితుల పేర్లను బహిర్గతం చేశారని ఇప్పటికే ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆయనపై మరో రెండు ఫిర్యాదులు అందాయి. గోరంట్ల చేసిన అంతర్యుద్ధం వ్యాఖ్యలపై TDP, జనసేన అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశాయి. మాధవ్ మీద చర్యలు తీసుకోవాలంటూ కంప్లయింట్ చేశాయి. రాష్ట్రంలో అలజడులు సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపాయి.