ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రాష్ట్ర ప్రజలకు మంచి బడ్జెట్‌ను అందించామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో సీఎం మాట్లాడారు. "సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్‌కు రూపకల్పన చేశాం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కాలంటే పనితీరులో మార్పు రావాలి. గ్రూపు రాజకీయాలు సహించబోను." అని చంద్రబాబు అన్నారు.