రాణీ కుముదినీ దేవి వరంగల్ జిల్లా వడ్డేపల్లికి చెందిన సంస్థానపు రాణీ. ఈమె 1911 జనవరి 23న వడ్డెపల్లిలో జన్మించారు. ఈమె తండ్రి పింగళి వెంకట రామారెడ్డి హైదరాబాద్ రాజ్యానికి ఉపప్రధానిగా పనిచేశారు. శివానంద స్వామి ప్రవచనలకు ప్రభావితురాలై కూకట్‌పల్లిలో కుష్టు వ్యాధిగ్రస్తులకు శివానంద ఆశ్రమం స్థాపించారు. తర్వాత హైదరాబాద్ తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు. 1962లో వనపర్తి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.