ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. బుధవారం నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ భూపేష్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, డిఎస్పి హుస్సేన్ పీరా, నగర పంచాయతీ కమిషనర్ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ కొనసాగింది. జమ్మలమడుగు పాత బస్టాండ్ లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు.