వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టాలు అందించిన బాధితులకు రెవెన్యూ అధికారులు న్యాయం చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కోరారు. గతంలో జమ్మలమడుగు పట్టణ కేంద్రానికి సమీపంలో కొంతమంది లబ్ధిదారులకు పట్టాలు అందించి స్థలాలను కేటాయించినట్లు మంగళవారం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడించారు. లబ్దిదారులు ఏర్పాటు చేసుకున్న బేస్ మట్టం ప్రాంగణాలను కొందరు దుండగులు ధ్వంసం చేశారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.