పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కడప ఎస్పీ

58చూసినవారు
కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ ను బుధవారం కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన దాదాపు రెండు గంటలపాటు పోలీస్ స్టేషన్లో పలు కేసుల రికార్డులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన సిబ్బందిని పిలిచి ప్రతి ఒక్కరితోనూ వారు పోలీస్ స్టేషన్ లో చేస్తున్న పనుల గురించి ఆరా తీశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం, గంజాయి సేవించడం వంటి నేరాలను అరికట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్