కడప జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు క్యాంపు కార్యాలయం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఆఫీస్ వెనుక వైపున మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. బస్సుల ఫిట్ మెంట్ ప్రొసీజర్ ప్రకారం కాలం చెల్లిన బస్సుల సర్వీసులను నిలిపివేసి కొత్త బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు.