వారం రోజుల్లో ఎర్ర చెరువును పూర్తిగా నీటితో నింపుతాం: ఏఈ

69చూసినవారు
వారం రోజుల్లో ఎర్ర చెరువును పూర్తిగా నీటితో నింపుతాం: ఏఈ
మైదుకూరు ఎర్ర చెరువుకు నీటిని త్వరగా నింపే ప్రయత్నాలలో భాగంగా శుక్రవారం సంబంధిత అధికారులు, టిడిపి నాయకులు పనులను ముమ్మరం చేశారు. ఎస్ ఆర్ 2 నుండి ఎర్ర చెరువుకు నీరు వచ్చే మార్గమధ్యంలో అనేక చోట్ల అడ్డుగా ఉన్న వ్యర్ధాలను, ముళ్లపోదలతో కూడిన చెట్లను తొలగించి చెరువులకు, పొలాలకు మళ్లించారు. ఈ కార్యక్రమంలో తెలుగు గంగా ఏఈ లు కిరీటి, నాగిరెడ్డి, టిడిపి నాయకులు ఏపీ రవీంద్ర మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్