వైసీపీ నేత, ఫైబర్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ గౌతమ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆధారాలు చేరిపి వేయడం, సాక్షులను బెదిరించడం వంటివి చేయరాదని ఆదేశించింది.