AP: పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో గురువారం దారుణ ఘటన జరిగింది. వెల్లటూరు గ్రామంలో కన్న తల్లిని కుమారుడు కొట్టి చంపాడు. వివరాల ప్రకారం.. తల్లి సోమమ్మను కొడుకు బాదరయ్య చిన్న వివాదం కారణంగా తలపై కర్రతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది. అయితే బాదరయ్య మానసిక స్థితి సరిగా లేదని బంధువులు అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.