BSNLకు భారీగా పెరిగిన సబ్స్క్రైబర్లు
ప్రభుత్వ సంస్థ BSNLకు కొన్ని నెలలుగా సబ్స్క్రైబర్ల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. జులైలో దాదాపు 30 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకుంది. ఎయిర్టెల్ నుంచి 17 లక్షలు, వోడా ఐడియా నుంచి 14 లక్షలు, జియో నుంచి 8 లక్షల మంది వినియోగదారులు వచ్చినట్లు పేర్కొంది. ఆగస్టులో కూడా BSNL 25 లక్షల మంది కొత్త కస్టమర్లను చేర్చుకున్నట్లు తెలిపింది.