మహిళపై దాడి చేసిన వీధి కుక్కలు (షాకింగ్ వీడియో)
తెలంగాణలోని కరీంనగర్లో శనివారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. మహిళా కళాశాల సమీపంలో ఓ మహిళపై వీధి కుక్కలు దారుణంగా దాడి చేశాయి. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మహిళ చేతిలో చిన్నారి కూడా ఉంది. స్థానికుల రక్షణతో తల్లీ బిడ్డ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.