టీడీపీ- వైసీపీ నేతల మధ్య వాగ్వాదం
AP: గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ వర్గీయులపై వైసీపీ నేతలు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చేబ్రోలు మండలం అనుమర్లపూడిలో ఈ ఘటన చోటుచేసుకుంది. వినాయకుడి నిమజ్జనం జరుగుతున్న సమయంలో ఈ రాళ్లదాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.