వరద బాధితుల సహాయార్థం రూ.కోటి చెక్‌ను అందజేసిన మెగాస్టార్
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడిని మెగాస్టార్ చిరంజీవి శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ క్రమంలో రూ.కోటి విలువైన చెక్కులను అందజేశారు. ఇటీవల ఏపీలో భారీ వర్షాలతో వరదలు సంభవించి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి తెలుగు రాష్ట్రాలకు తలో కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఆ చెక్కులను ఇవాళ అందజేశారు.