వచ్చే నెల 6న జరిగే దళిత సంక్షమ సభను విజయవంతం చేయాలి

96చూసినవారు
వచ్చే నెల 6న జరిగే దళిత సంక్షమ సభను విజయవంతం చేయాలి
కోదాడ : జూన్‌ 6వ తేదిన కోదాడలో జరిగే దళిత సంక్షేమ సబను విజయవంతం చేయాలని తెలంగాణ దళిత సంక్షేమ సంఘం రాష్ట్ర అద్యక్షుడు గుర్రాల పరవేష్‌, ప్రముఖ న్యాయవాది ఈదుల కృష్ణయ్యలు పిలుపు నిచ్చారు. ఈ మేరకు కోదాడలోని బాలుర ఉన్నతపాఠశాలలో సభ కరపత్రాన్ని వారు సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ డాక్టర్‌ బిఆర్‌ ఆంబేద్కర్‌ ఆశయాల అమలు కొరకు అధిక సంఖ్యలో అట్టడుగు వర్గాలు బహుజనులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం అధ్యక్షుడు మాదాజు ఉపేందర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి కాసర్ల శ్యామ్‌సుందర్‌, కోదాడ మండల అధ్యక్షుడు మండవ చంద్రశేఖర్‌, హుజూర్‌నగర్‌ అద్యక్షుడు గంజి సైదులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్