అసోంలో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో మాదకద్రవ్యాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. తాజాగా అసోంలోని పోలీసులు రూ.36 కోట్ల విలువైన 1.20 లక్షల డ్రగ్స్ మాత్రలను స్వాధీనం చేసుకున్నట్లు సీఎం హిమంత బిశ్వశర్మ స్వయంగా వెల్లడించారు. మాదకద్రవ్యాలపై పోలీసులు నిర్విరామ పోరాటం చేస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు.