రైతుల నిరసనలతో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దు దద్దరిల్లుతోంది. యునైటెడ్ కిసాన్ మోర్చా ఢిల్లీ మార్చ్ ప్రకటించడంతో సోమవారం నోయిడా నుంచి రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో రైతులు మహామాయ ఫ్లైఓవర్ కింద నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్ వేని పూర్తిగా అడ్డుకున్నారు. ఈ నిరసనతో దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.