ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం నుండి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడ లేదని తెలుస్తోంది. ఇవాళ్టి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రచారం కూడా ఒట్టిదేనని తేలిపోయింది. అలాగే సచివాలయాల్లోనూ దీనికి సంబంధించి ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. పాత రేషన్ కార్డులు తొలగించి వాటి స్థానంలో కొత్త కార్డులు ఏర్పాటు చేసిన తర్వాత దరఖాస్తుల స్వీకరణ చేపడతామని ప్రభుత్వం చెబుతుంది.