పీఎం ‘సూర్యఘర్‌’కు 1.45 కోట్ల రిజిస్ట్రేషన్లు: కేంద్రం

78చూసినవారు
పీఎం ‘సూర్యఘర్‌’కు 1.45 కోట్ల రిజిస్ట్రేషన్లు: కేంద్రం
సౌర విద్యుత్తు వినియోగం పెంచేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పీఎం సూర్యఘర్‌’ పథకానికి దాదాపు 1.45 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు 6.34 లక్షల ఇన్‌స్టాలేషన్లు పూర్తి చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ తెలిపారు. 2023-24 నుంచి 2026-27 నాటికి రూ.75,021 కోట్ల వ్యయంతో ఈ పథకం కింద కోటి ఇన్‌స్టాలేషన్లు ఏర్పాటు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్