వ్యాధుల బారిన 10 కోట్ల మంది

68చూసినవారు
వ్యాధుల బారిన 10 కోట్ల మంది
కల్తీ కారణంగా దేశంలో సుమారు 10కోట్ల మంది రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరుతుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు కలుషిత ఆహారం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ కారణంగానే ఏటా సుమారు 4,20,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆహార కల్తీకి ఎక్కువగా అయిదేళ్లలోపు చిన్నారులే ప్రభావితం అవుతుండటం తీవ్ర ఆందోళనకరం. వీటి వల్ల అతిసారం, క్యాన్సర్లతో పాటు 200 రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

సంబంధిత పోస్ట్