బాక్సింగ్ డే టెస్టులో టీమ్ ఇండియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కొన్స్టస్ 8, ఖవాజా 21, స్మిత్ 13, హెడ్ 1, మార్ష్ 0, అలెక్స్ కారీ 2 విఫలమయ్యా రు. ఫస్ట్ ఇన్నింగ్సులో హెడ్‌ను డకౌట్ చేసిన బుమ్రా, రెండో ఇన్నింగ్సులో 1 పరుగుకే వెనక్కి పంపారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా లీడ్ 196 పరుగులుగా ఉంది. బుమ్రా 4, సిరాజ్ 2 వికెట్లు పడగొట్టారు.