అస్సోంలో అతిసార వ్యాధితో 11 మంది మృతి

75చూసినవారు
అస్సోంలో అతిసార వ్యాధితో 11 మంది మృతి
అస్సోం రాష్ట్రంలో అతిసార వ్యాధి తీవ్ర కలకలం రేపుతోంది. టిన్సుకియా జిల్లాలోని ఓ టీ ఎస్టేట్‌లో డయేరియా కారణంగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కేవలం వారం వ్యవధిలోనే మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో అపరిశుభ్రత, సరైన తాగునీరు లేకపోవడంతో ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ వ్యాధి వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్