జాతరలో ప్రసాదం తిని.. 50 మందికి అస్వస్థత

56చూసినవారు
జాతరలో ప్రసాదం తిని.. 50 మందికి అస్వస్థత
ఓ ఆలయ జాతరలో ప్రసాదం తిని సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం బెలగావిలో బుధవారం చోటు చేసుకుంది. బెలగావిలోని హూలికట్టి గ్రామంలో గల భీరేశ్వర్, కరెమ్మ ఆలయం వార్షికోత్సవం సందర్భంగా జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ పంచిపెట్టిన ప్రసాదం తిని 50 మంది దాకా అస్వస్థతకు గురైనట్లు అధికారులు తెలిపారు. కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్