గుజరాత్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. గుజరాత్ లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, వరదల వల్ల ఇప్పటివరకు 15 మంది చనిపోయారు. ఆనంద్ లో ఆరుగురు, గాంధీనగర్, మహిసాగర్ లో ఇద్దరు చొప్పున, మోర్బి, వడోదర, ఖేడా, బరూచ్, అహ్మదాబాద్ జిల్లాల్లో కనీసం ఒకరు చొప్పున మరణించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 23, 870 మందిని రక్షణ బృందం సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. 1,696 మందిని రక్షించారు.