విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసిన టీచర్లకు భారీ షాక్ (వీడియో)

74చూసినవారు
సంతాప దినాల్లో ఓ పాఠశాలలో విద్యార్థులతో కలిసి టీచర్లు డ్యాన్స్ చేయడం వివాదాస్పదంగా మారింది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతితో మధ్యప్రదేశ్‌లో ఏడు రోజుల సంతాప దినాలు ప్రకటించారు. అయితే, ధార్ జిల్లా ధారవర గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ పాఠశాలలో వార్షిక కార్యక్రమం సందర్భంగా టీచర్లు విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్