అధిక ఆవలింతలు శారీరక సమస్యలను సూచిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్ర లేకపోవడం, మానసిక అలసటతోనూ ఇవి వస్తాయని అంటున్నారు. అధిక ఆవలింతలు గుండె సమస్యలకు సంకేతాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది మూర్చ వంటి నాడీ సంబంధిత సమస్యలతో ఇవి ముడిపడి ఉండవచ్చని వెల్లడిస్తున్నారు. శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గితే, శరీరానికి ఆక్సిజన్ సరఫరా తగ్గి, ఇది జరుగుతుందని వివరించారు.