విశ్వక్‌సేన్ కొత్త చిత్రం ‘లైలా’. ఇందులో అతను లేడీ గెటప్‌లో కనిపించనున్నారు. గురువారం ఈ చిత్రం నుంచి మూవీ టీం ఓ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో విశ్వక్‌సేన్ మాట్లాడుతూ.. ‘లైలా గెటప్ వేసుకున్న తర్వాత మా నాన్నకు వీడియో కాల్ చేశా. నన్ను గుర్తుపడతారేమోనని వేచి చూశా. ఏమీ మాట్లాడకపోయే సరికి ‘డాడీ నేను’ అన్నాను. దీంతో ఆయన కంగారు పడిపోయారు.’ అని ఫన్నీ కామెంట్స్ చేశారు.