ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కీలక నిర్ణయం

74చూసినవారు
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కీలక నిర్ణయం
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్‌లో ఇప్పటి వరకు 600 మందిని తొలగించామని పేర్కొన్నారు. అయితే, త్వరలోనే సంస్థ విస్తరణ చేయనున్నామని, సంస్థలో తొలగించిన వారి స్థానంలో మళ్లీ ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. త్వరలోనే ఈ నియామకాలు ఉంటాయన్నారు. కేబుల్ ఆపరేటర్ల మీద గత ప్రభుత్వ హయంలో రూ.100 కోట్లు జరిమానా వేశారు. ఇదంతా కక్ష పూరితంగా జరిగిందని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు.

సంబంధిత పోస్ట్