నేటి కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఫేమ్ అవ్వడం కోసం రీల్స్ చేస్తుంటారు. అయితే ఓ పాఠశాలలో ముగ్గురు బాలికలు దెయ్యం పట్టినట్టుగా తరగతి గదిలో నుంచి ఒక్కసారిగా గ్రౌండ్ దూకి హల్‌చల్ చేశారు. నేలపై పడుకుని దొర్లుకుంటూ దెయ్యం పట్టినట్టుగా గట్టిగా కేకలు వేస్తూ రచ్చ చేస్తూ రీల్ చేశారు. దీంతో తోటి విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.