2034 FIFA వరల్డ్ కప్‌కు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇవ్వనుంది. బుధవారం జరిగిన సమావేశంలో ఫుట్‌బాల్ ఫెడరేషన్ 2030, 2034 పురుషుల ప్రపంచ కప్ హోస్ట్‌లను అధికారికంగా ప్రకటించింది. 2030 గేమ్స్‌ను మొరాకో, స్పెయిన్ మరియు పోర్చుగల్ లో నిర్వహించనున్నట్లు తెలుపగా 2034లో సౌదీ అరేబియాలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియా వైదొలగడంతో 2034 టోర్నమెంట్‌కు ఏకైక బిడ్డర్‌గా సౌదీ అరేబియా హోదాను FIFA ధృవీకరించింది.