సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికీ సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర రూ.825.50 ఉంది. ఏడాదికి మూడు సిలిండర్ల లెక్కన ప్రస్తుతమున్న వంటగ్యాస్ ధర ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.2,476.50 ప్రయోజనం లభిస్తుంది. రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్లకార్డు ప్రాతిపదికగా తీసుకుంటే ఇందులో 95%పైన అంటే 1.47 కోట్ల కుటుంబాలు అర్హత సాధిస్తాయి.