8 ఏళ్లుగా శ్వాసనాళంలో 25 పైసల నాణెం.. అరుదైన సర్జరీ

66చూసినవారు
8 ఏళ్లుగా శ్వాసనాళంలో 25 పైసల నాణెం.. అరుదైన సర్జరీ
ఎనిమిదేళ్లుగా శ్వాసనాళంలో 25 పైసల నాణెం చిక్కుకున్న ఓ వ్యక్తికి అరుదైన సర్జరీ చేసి తొలగించారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ ఘటన జరిగింది. బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)లోని సుందర్‌లాల్ హాస్పిటల్‌ డాక్టర్లు నాణేన్ని గుర్తించారు. కార్డియో-థొరాసిక్ సర్జన్ ప్రొఫెసర్ సిద్ధార్థ్ లఖోటియా, ప్రొఫెసర్ ఎస్‌కే మాథుర్ నేతృత్వంలోని వైద్యుల బృందం మంగళవారం 20 ని. పాటు ఆ వ్యక్తికి సర్జరీ చేసి.. సురక్షితంగా ఆ నాణేన్ని బయటకు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్