నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భారత రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,000 గ్రూప్-డి ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు లెవల్-1 పోస్టులకు సంబంధించి ఈ నెల 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 23 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనుంది. పిబ్రవరి 22తో గడువు ముగుస్తుంది. పోస్టుల వారీ ఖాళీలు, సిలబస్ తదితర వివరాలను త్వరలో విడుదల చేయనుంది.