యల్లమంద చేరుకున్న సీఎం చంద్రబాబు

70చూసినవారు
యల్లమంద చేరుకున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పల్నాడు జిల్లా యల్లమంద చేరుకున్నారు. ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో సీఎం అక్కడికి వెళ్లారు. హెలిపాడ్ వద్ద సీఎం చంద్రబాబుకు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, మంత్రులు గొట్టిపాటి, పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో లబ్ధిదారులకు చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అలాగే, లబ్ధిదారులతో కలిసి గ్రామసభలో పాల్గొననున్నారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్