'ఏ చోట నువ్వున్నా' సాంగ్ లిరిక్స్

4237చూసినవారు
'ఏ చోట నువ్వున్నా' సాంగ్ లిరిక్స్
ఏ చోట నువ్వున్నా
నీ వెంట వస్తున్నా
మనసు నిలవనంటే
ఎలా ఆపను

ఏ గాలి వీస్తున్న
నీ ఊసే వింటున్నా
ఈ వింత భావం
ఎలా చెప్పను

ఇన్నాళ్లు పక్కన
లేవు కదా
అనే మాట గుర్తుకు
రాదు కదా

ఇన్నాళ్ల
ఒంటరితనమంతా
నిన్ను చూసి
తప్పుకు పోయిందా

హే ర తరర రారరా
హే ర తరర రారరా

పెదవులకెన్నడు
తెలియని నవ్వులు
పరిచయమయినవి
నీ వలన

ఇదివరకెన్నడు
కలగని ఆశలు
మొదలవుతున్నవి
నీ వలన

ఏమైందో ఏమో
నిజంగా
లోకం మారిందో
ఏమో కొత్తగా

ఏ చోట నువ్వున్నా
నీ వెంట వస్తున్నా
మనసు నిలవనంటే
ఎలా ఆపను

ఏ గాలి వీస్తున్న
నీ ఊసే వింటున్నా
ఈ వింత భావం
ఎలా చెప్పను

గీత

హే ర తరర రారరా
హే ర తరర రారరా

ఏ నడి రాతిరి
నా దరి చేరక
కావలి ఉందిగా
నీ మమతా

నా ప్రతి ఊపిరి
ఆయువు పోయగా
వాడదుగా మన
ప్రేమలత

నూరేళ్లు నీతో
సాగని
వెతికే ఆ స్వర్గం
మనతో చేరని

ఏ గాలి వీస్తున్న
నీ ఊసే వింటున్నా
ఏ వింత భావం
ఎలా చెప్పను

ఏ చోట నువ్వున్నా
నీ వెంట వస్తున్నా
మనసు నిలవనంటే
ఎలా ఆపను

సినిమా: జానీ
మ్యూజిక్: రమణ గోగుల
సింగర్: రాజేశ్, నందిత
లిరిక్స్: సిరివెన్నెల

సంబంధిత పోస్ట్