దేశంలోని పేద కుటుంబాలకు రూ.46,715 చొప్పున కేంద్రం ప్రభుత్వం ఇస్తోందనే వార్త కొన్నాళ్లుగా వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. వ్యక్తిగత వివరాలు అందించాలని ఓ లింక్‌ను సైతం అందులో ఉంది. అవగాహన లేక కొందరు దీనిని ఇతరులకు షేర్ చేస్తున్నారు. దీనిపై తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్పందించింది. ఫ్యాక్ట్ చెక్ చేసి ఈ వార్త ఫేక్ న్యూస్‌గా తేల్చింది.