దక్షిణ వియత్నాంలో బర్డ్‌ఫ్లూ వైరస్ (హెచ్5ఎన్1) తీవ్ర కలకలం రేపుతోంది. ఈ వైరస్ కారణంగా ఇటీవల 47 పులులు, మూడు సింహాలు, ఒక పాంథర్ మృతి చెందినట్లు ఆ దేశ మీడియా స్పష్టం చేసింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో పలు జూలలో ఈ మరణాలు సంభవించినట్లు తెలిపింది. ఈ జంతువుల శాంపిల్స్‌ను నేషనల్ సెంటర్ ఫర్ యానిమల్ హెల్త్ డయాగ్నోసిస్‌కు పంపగా, హెచ్5ఎన్1 టైప్ ఎ రకం కారణంగానే ఈ మరణాలు జరిగినట్లు సమాచారం.